
ఘనంగా పూసపాటి పద్య పాఠశాల తృతీయ వార్షికోత్సవ కు వేడుకలు.....
ది 31-01-2026, గుంటూరు :ఈరోజు తెలుగు కావ్య మధనం సాహితి బృందం పూసపాటి పద్య పాఠశాల తృతీయ వార్షికోత్సవం గుంటూరు మహానగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో, దాదాపుగా వందకు పైగా పూసపాటి పద్య పాఠశాల, తీర్చిదిద్దిన కవులు,కవయిత్రులు అత్యంత మనోహరంగా కన్నుల పండుగగా,మహానుభావుల మహితోన్నత ప్రసంగాల మధ్య నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నాట్యాంజలి సాయి మంజీరా కూచిపూడి విద్యార్థినులచే కూచిపూడి నృత్య కార్యక్రమంతో సభ ప్రారంభమైంది.ఈ సభకి అధ్యక్షులుగా పూసపాటి పద్య పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ అధ్యక్షత వహించి కార్యక్రమ నిర్వహణ దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా విచ్చేసిన మహా మహోపాధ్యాయ, జ్యోతిష ముహూర్త విద్వన్మణి,శ్రీ భావ నారాయణస్వామి సంస్కృత కళాశాల పొన్నూరు, సంస్కృతో పన్యాసకులు బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు మరియు అమరావతి సాహితీ మిత్ర మండలిసంస్థ అధ్యక్షులు రావి రంగారావు గారు పట్టాభి కళాపీఠం యొక్క అధ్యక్షులు, శ్రీ తుములూరు రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు మాట్లాడుతూ,కవిత్వం భావ పరంపర నుండి పుడుతుందని, వ్రాసే ప్రతి పద్యము కవిత్వం అయి ఉండాలని, ఆ కవిత్వం దోహదపడుతుందని, పూసపాటి పద్య పాఠశాల ద్వారా తయారైన కవులు గాని, కవయిత్రులుగాని సమాజానికి ఉపయోగపడే కవిత్వాన్ని అందించాలని, కవిత్వం మార్గదర్శకాలను, అదేవిధంగా రావి రంగారావు గారు, కవిత్వం దీర్ఘ సమాసాలతోనే కాకుండా, వాడుక భాషలో ప్రాంతీయ భాషల్లో కూడా సృష్టించవచ్చని, అట్టి కవిత్వం ప్రజల్లోకి తొందరగా వెళుతుందని తెలియజేశారు. రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ మంచి భాష నుండి పుట్టిన కవిత్వం వికసిస్తుందని, అది సమాజానికి చేరువవుతుందని, సమాజం కొరకు కవుల కలమును విదిలించాలని ఉద్భోదించారు. తదనంతరం దాదాపుగా 11 మంది కవులు కవయిత్రులు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు.ఒక చిన్న వాట్సప్ గ్రూపుగా మొదలైన ఉచిత పద్య రచన, ఇప్పుడు శాకోప శాఖలుగా విస్తరించి,ఒక వృక్షంగా విస్తరించిందని, చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పాఠశాల ప్రారంభించిన శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారు చేసిన కృషికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో వారి పేరు నమోదు చేయటం జరిగింది. గురువుగారి గొప్ప కృషి దక్కిన గౌరవంగా కొనియాడవచ్చు. ఈ కార్యక్రమాలు రెండు రోజులపాటు గుంటూరు మహానగరంలో జరుగుతాయని, నిర్వాహకులు తెలియజేశారు. రేటు అనగా ఫిబ్రవరి 1 26 న ప్రముఖ విద్వాన్ మనీ సాహితీవేత్త అవధాని శ్రీ బులుసు అపర్ణ గారి అవధానం ఉంటుందని, అందులో పూసపాటి పద్య పాఠశాల విద్యార్థులు పుచ్చకులుగా పాల్గొని అవగాహన విశేషణాలను తెలుసుకోవడమే కాకుండా అవధానానికి ఒక విశేషంగా నిలుస్తారు.ఈ కార్యక్రమంలో ఏఐ ఎంఏ మీడియా యాక్టివిస్ట్ నండూరి వెంకటేశ్వర్లు పుచ్చుకులుగా పాల్గొనడం జరుగుతుంది.