logo

బొలెరో మినీ ట్రక్కులో గంజాయి రవాణా* *198 కేజీల గంజాయి స్వాధీనం* *మార్టూరు పోలీసులను అభినందించిన ఈగల్ టీం ఎస్పీ ఉమామహేశ్వర్*

జర్నలిస్టు : మాకోటి మహేష్

*బొలెరో మినీ ట్రక్కులో గంజాయి రవాణా*
*198 కేజీల గంజాయి స్వాధీనం*
*మార్టూరు పోలీసులను అభినందించిన ఈగల్ టీం ఎస్పీ ఉమామహేశ్వర్*

బాపట్ల జిల్లా మార్టూరు సీఐ శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు ఈగల్ టీం, మార్టూరు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి బొలెరో వ్యాన్లో తుని నుండి బెంగళూరుకు 198 కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో గంజాయి నిర్ములన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో తరలిస్తున్న 198 కేజీల గంజాయి శుక్రవారం పట్టుకోవడం జరిగిందని అన్నారు. తుని నుండి కర్ణాటక తరలిస్తున్న గంజాయిని రాబడిన సమాచారం మేరకు మార్టూరు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారని అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాపట్ల జిల్లాలో గంజాయి నిర్మూలనే ధ్యేయంగా గతంలో గంజాయి వ్యక్తులకు వారికి అవగాహన కల్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గంజాయి రహిత బాపట్ల జిల్లాగా మార్చడమే ద్వేయమని బాపట్ల జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయించిన తరలించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.

ముద్దాయిలను అత్యంత చాకచక్యముగా పట్టుకోనుటలో ప్రతిభ కనభరిచిన మార్టూరు ఇన్స్పెక్టర్ గారైన వై.శ్రీనివాసరావు, ఎస్సై -షేక్ సైదా, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ఆంజనేయులు, కానిస్టేబుల్స్ రమేష్, నాగేశ్వరరావు, శివకుమార్ మరియు హోంగార్డ్స్ రవి, రషీద్ లను బాపట్ల జిల్లా ఎస్పీ అభినందిచారు.

ఈ సమావేశం లో అడిషనల్ ఎస్పీ రామాంజనేయుల, మార్టూరు సిఐ శ్రీనివాసరావు ఎస్ఐలు ఉన్నారు.

3
36 views