logo

మర్రి నరేష్ నేటి ప్రధాన వార్త: ప్రస్తుత బడ్జెట్ సామాన్యులకు ఊరటనిచ్చే సంకేతాలు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత, వైద్య రంగంలో మార్పులు

కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్న తరుణంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఆదాయపు పన్ను (ఇన్కమ్ టాక్స్) మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనివల్ల సామాన్యుల చేతుల్లో మరిన్ని నిధులు మిగిలే అవకాశం ఉంది ఇది కొనుగోలు శక్తిని పెంచుతుంది


​తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది మొదటి విడతలో లబ్ధి పొందని అర్హులైన పేదలకు ఈ విడతలో ప్రాధాన్యత లభించనుంది ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు కాస్త ఊరట


​తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే నేటి తాజా సమాచారం ప్రకారం మరిన్ని కార్పొరేట్ ఆసుపత్రులను ఈ నెట్‌వర్క్‌లోకి చేర్చుతూ సామాన్యులకు అత్యాధునిక వైద్యం మరింత చేరువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది



​ప్రజలకు ఇబ్బంది కలగకుండా తెలంగాణలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నారు ఇందులో భాగంగా వేచి ఉండే గదులు (వెయిటింగ్ హాల్స్) ఫీడింగ్ రూమ్స్ వంటి కనీస వసతులను ఏర్పాటు చేస్తున్నారు సామాన్య ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఇవి ఎంతో తోడ్పడతాయి


​AI మోడల్స్ కృత్రిమ మేధ (AI) కేవలం టెక్కీలకే కాకుండా సామాన్య ప్రజల దైనందిన సమస్యల పరిష్కారానికి (ఉదాహరణకు వ్యవసాయం, విద్య) ఉపయోగపడేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది

​గిగ్ వర్కర్ల సంక్షేమం డెలివరీ బాయ్స్ ఇతర గిగ్ వర్కర్ల ఆదాయం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది

8
2193 views