logo

రేపు ఉద్యోగుల సమస్యల పరిష్కార కార్యక్రమం..జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా.

నంద్యాల:: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేపు (జనవరి 30) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు అర్జీలు స్వీకరించి, 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అంశాలను సంబంధిత అధికారులకు వివరిస్తామన్నారు. వార్షిక ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, కార్యాలయాల మౌలిక సదుపాయాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై అర్జీలు స్వీకరిస్తామని వివరించారు. అలాగే, క్రమశిక్షణారాహిత్య కేసులు పెండింగ్‌లో ఉండటంతో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు నిలిచిపోయిన అర్జీలను కూడా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారు.*

0
99 views