logo

చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బంగారు చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్. - సుమారు ఏడు కోట్ల విలువైన 4.49 KG ల బంగారు ఆభరణాలు స్వాధీనం.

చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బంగారు చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్. - సుమారు ఏడు కోట్ల విలువైన 4.49 KG ల బంగారు ఆభరణాలు స్వాధీనం.
చింతలపూడి పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో 09.09.2025 ఉదయం 11 గంటల సమయంలో ఆడిట్ నిమిత్తం హెడ్ ఆఫీసు నుండి వచ్చిన ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేశ్ నిబంధనలకు విరుద్ధంగా లాకర్లలోని మొత్తం బంగారాన్ని బయటపెట్టి ఆడిట్ నిర్వహించాడు.
సాయంత్రం సమయంలో బ్రాంచ్ మేనేజర్ బయటకు వెళ్లిన అవకాశాన్ని ఉపయోగించుకుని, క్యాషియర్‌ను కూడా బయటకు పంపి, ముందుగా తెచ్చుకున్న బ్యాగ్‌లో 378 కవర్లలో ఉన్న 4.490 కిలోల బంగారు ఆభరణాలు (సుమారు రూ.7 కోట్ల విలువ) వేసుకుని పారిపోయాడు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
👉 ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ K.P.S. కిషోర్, IPS గారి పర్యవేక్షణలో 👉 జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి ఆర్. సుస్మిత, IPS
👉 ఇంచార్జ్ డీఎస్పీ శ్రీ యు. రవి చంద్ర గారి ఆధ్వర్యంలో
చింతలపూడి సర్కిల్ పోలీసులు, జిల్లా సైబర్ సెల్ మరియు ఐటీ కోర్ సహకారంతో విస్తృత దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడైన
వడ్లమూడి ఉమా మహేశ్ (38 సం.),
నివాసం: నాయుడుపేట, నెల్లూరు జిల్లా
వారిని 28.01.2026 న అరెస్ట్ చేసి, చోరీకి గురైన మొత్తం బంగారాన్ని పూర్తిగా రికవరీ చేశారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
• 4.484 కిలోల బంగారు ఆభరణాలు (రూ.7 కోట్ల విలువ)
• మొబైల్ ఫోన్
• పచ్చరంగు షోల్డర్ బ్యాగ్
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

4
47 views