logo

RNIగుర్తింపు కలిగిన మీడియా సంస్థలు ఇచ్చే ఐడీ కార్డ్స్ డమ్మీలా...??*....

*జర్నలిస్టులకు అక్రిడేషన్లు కొలమానం కాదు*
*RNIగుర్తింపు కలిగిన మీడియా సంస్థలు ఇచ్చే ఐడీ కార్డ్స్ డమ్మీలా...??*
*సోషల్ మీడియా కూడా పెరిగింది,అయితే గుర్తింపు తప్పనిసరి...!!!*
*యూ ట్యూబర్స్ కి ట్రేడ్ మార్క్,మీడియా సంస్థగా రిజిస్ట్రేషన్ లు ఉంటాయి...!!*
ఈ మధ్య కాలంలో మీడియాపై ఎక్కడాలేని ఆంక్షలు పెరిగిపోయాయి. కారణం మీడియా ముసు గులో కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ మీడియా అనే హోదాలో లేనిపోని హుందాతనం ప్రదర్శన చేస్తున్నారు. మీడియా గుర్తింపు కార్డ్ ఉంటే చాలు.ఆ కార్డ్ ఉన్న వ్యక్తి కి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లు,ఎవడ్రా మనకు అడ్డు అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొంద రు.సరిగ్గా ఇక్కడే ఐడీ కార్డ్స్ కాకుండా అక్రిడేషన్స్ అనేవి ప్రామాణికంగా చూస్తున్నారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ జరిపి అక్రిడేషన్ల కార్డులు లేకుండా తిరుగు తున్న వాహనాలను ఆపి తనిఖీ చేసి ప్రెస్ అని స్టిక్కర్ వేసుకున్న వాహనదారు లకు అక్రీడేషన్ లేకుండా ప్రెస్ స్టిక్కర్ వేసుకోకూడ దని కౌన్సెలింగ్ ఇస్తున్న ఘటనలు రాష్ట్రంలో ఉన్నాయి.ఇటువంటి విధానాల పట్ల గతంలో అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడ రేషన్ జాతీయ ఉపాధ్య క్షులు సీహెచ్. పూర్ణచంద్ర రావు ఒక ప్రకటనలో విచా రం వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి అక్రిడేషన్ కార్డ్ ని ప్రభుత్వం ఒక్కొక్క మీడియా హౌస్ లో కొంత మంది జర్నలిస్టులకు మాత్రమే నిబంధనలకు లోబడి జారీ చేస్తుందని, అయితే అదే ప్రెస్ స్టిక్కర్ వేసుకోవద్దనేందుకు కొల మానం కాదని,ఆయా మీడియా హౌస్ లు జారీ చేసిన ఆ సంస్థ జర్నలిస్ట్ గుర్తింపు కార్డ్ ని పోలీస్, రెవిన్యూ,ఇతర శాఖల ఉద్యోగులకుమాదిరి కలిగి ఉన్న జర్నలిస్టులను ఆ సంస్థ జారీచేసిన గుర్తింపు కార్డు ని తనిఖీ చెయ్యాలి గాని అక్రిడేషన్ల కార్డ్ కాదన్నారు.
అసలు అక్రిడేషన్ కార్డ్ మీదేననే నిబంధన ఉం టుందని పైగా ఇది కలిగి ఉన్న వారు ప్రభుత్వ గుర్తిం పు కలిగియున్నట్లు కూడా ఎక్కడా పేర్కొన కూడదు. అన్న నిబంధన ప్రభుత్వ (ఐ&పి ఆర్ ) జి.ఓ లో కూడా పేర్కొనబడి ఉంటుం ది.అలాంటి అక్రిడేషన్ల కార్డు లేని జర్నలిస్టులను ఇబ్బం ది పెట్టకుండా సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డులు ప్రమా ణంగా తీసుకోవాలన్నారు. ఒకవేళ తనిఖీ చేసిప్పుడు ఆ గుర్తింపు కార్డులు నకిలీ వి అయినా,ఒకవేళ ఆ సమయంలో సంస్థ గుర్తిం పు కార్డు చూపించ లేకున్నా అలాంటి వారి స్టిక్కర్లు తొల గించవచ్చని ఒకప్పుడు పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేశారు.అక్రిడేషన్లు అనేవి కొన్ని ప్రభుత్వ సౌకర్యాలు పొం దేందుకు గుర్తింపు తప్ప జర్నలిస్ట్ వృత్తికి కొల మానం మాత్రం కాదని ఆయా మీడియా సంస్థలు జారీ చేసే గుర్తింపు మాత్ర మే అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కొందరు తమ వాహనాలపై ప్రెస్ స్టిక్కర్ వేసుకుని నిజమైన జర్నలిస్టులకు,అక్రిడేషన్ లేని జర్నలిస్ట్ లకు ఇబ్బం దులు కలిగిస్తున్నారు. ఇటువంటి వారిపై పోలీ సులు చర్యలు తీసు కోవడం మంచిదే. కనీసం అక్రిడేషన్ లేక పోయినా సంస్థ గుర్తింపు కార్డు అయినా జర్నలిస్ట్ కలిగి ఉండాలి.చాలా మీడియా సంస్థలు తమ సంస్థకు పని చేసే జర్నలిస్ట్ కు ఐడీ కార్డ్స్ ఇవ్వాలి అనే ఇంగిత జ్ఞానం సంస్థలకు ఉండాలి. నకిలీ ఐడీ కార్డులతో మనుగడ సాగిస్తున్న కొందరు నకిలీ విలేకరుల ఆట కట్టించాలి అంటే ఒక నిర్దిష్టమైన ప్రణా ళికలతో తమ సంస్థలో పని చేసే ప్రతి విలేకరుకు గుర్తిం పు కార్డు ఇచ్చేలా మీడియా సంస్థలు ఐడీ కార్డు లేని జర్నలిస్టుల సమస్య పరి ష్కరించే దిశగా ఆలోచన చెయ్యాలి.
మీడియా అక్రిడేషన్స్ వేలకువేలు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం అక్రి డేషన్స్ ని ప్రామాణికం చేసుకుని అబ్బో...వీడికి అక్రిడేషన్ ఉంది కాబట్టి సార్ చాలా పెద్ద జర్నలిస్ట్ అని పోలీసులు,ఇతర ప్రభుత్వ అధికారులు నమ్మేయడం సరికాదు.ఈ రోజున ఎవడో గొట్టం గాడు తెలియదు గానీ వాడికి అక్రిడేషన్ ఉంటుంది అనేది ప్రభుత్వ అధికారులు తెలుసుకోవాలి.అటువంటివాడి పేపర్ ఏదో ఛానల్ ఏదో తెలియదు.పలు వ్యాపారాలు చేసుకునే వారికి కూడా అక్రిడేషన్ ఉంది అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీడియా ఇలా అయిపో యింది.అక్రిడేషన్ అడ్డం పెట్టుకొని సమాజంలో వాడు చేసే అక్ర మాలు, అన్యాయాలు నిజంగా వార్తలు రాసే జర్నలిస్టులకు అక్రిడేషన్స్ లేకపోవడం చాలా బాధాకరం.నిజమైన జర్నలిస్టు లను కాదని ఇలా ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి అక్రిడేషన్స్ వస్తున్నాయి అంటే మన మీడియా సంస్థలు,కొందరు లోపాయికారీ వ్యక్తులు చేస్తున్న తప్పు అని మనం తెలుసు కోవాలి.అలాగే రోడ్ల వెంట,రాజకీయ నాయకుల సభలు- సమా వేశాల వద్ద,ప్రభుత్వ అధి కారిక కార్యక్రమాలు వద్ద న్యూస్ కవరేజీకి వచ్చే జర్నలిస్టులను అక్రిడేషన్స్ అడగడం కన్నా కనీసం ఆయా మీడియా సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డును పరిశీలించి వారిని ఆయా కార్యక్రమాలకు అనుమతించడం సున్నిత మైన అంశంగా ప్రభుత్వ అధికారులు మరి ముఖ్యం గా పోలీసులు గ్రహించాలి.

*ఈపూరి రాజారత్నం*
*MA(p.hd)*
*Journalism*
*Senior Journalist*
*9390062078*

0
0 views