logo

₹400 అప్పు.. ప్రాణం తీసింది! పాతరేగ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.


ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్‌ సీఐ నారాయణరావు వెల్లడించారు. మృతుడు సింహాచలం వద్ద నిందితుడు రూ.400లు అప్పుగా తీసుకున్నాడు. వాటిని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ ఘటనలో సింహాచలాన్ని తిరుపతి తోసివేయడంతో కుళాయి దిమ్మెపై పడి మృతి చెందాడు.

0
356 views