logo

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని తల్లిదండ్రులను హత్య చేసిన కన్న కూతురు

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

వికారాబాద్ జిల్లాలో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన కూతురు

బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఉంటూ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న నక్క సురేఖ అనే యువతి

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉండగా, కులాంతర వివాహానికి అంగీకరించని సురేఖ తల్లిదండ్రులు

దీంతో తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుండి అనస్థీషియా తెచ్చి, ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి, ఎక్కువ డోసేజ్ మత్తు మందు కలిగిన ఇంజెక్షన్లు తల్లిదండ్రులకు ఇచ్చిన యువతి

తల్లిదండ్రులు మరణించిన అనంతరం, సహజ మరణమని తన అన్నకు సమాచారం

అనుమానంతో విచారణ చేయగా, తానే హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించిన సురేఖ

కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

2
47 views