ఆత్మకూరు ఎమ్మార్వో చేతుల మీదుగా బహుజన స్టూడెంట్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ.
నంద్యాల (AIMA MEDIA): బహుజన స్టూడెంటు అసోసియేషన్ నూతన క్యాలెండర్లను వ్యవస్థాపక అధ్యక్షులు పాలుట్ల రమణ ఆధ్వర్యంలో* క్యాలెండర్లను ఎమ్మార్వో కార్యాలయంలో రత్న రాధిక చేతుల మీదుగా నూతన సంవత్సర బహుజన స్టూడెంట్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎమ్మార్వో రత్న రాధిక మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల కోసం స్టూడెంట్ సంఘాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర సెక్రెటరీ నాగ పాములేటి, జిల్లా అధ్యక్షులు పెద్ద స్వామి, చక్రి, వార్త న్యూస్ విలేఖరి పుల్లయ్య పాల్గొన్నారు.