అర్ధరాత్రి చనిపోయిన రైతుకు రైతు బీమా ఇవ్వాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లాడిపేట మండలం అక్కపల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకునే కూలి పండువు గంగయ్య వ్యవసాయం చేసుకుంటుండగా నాటు వేసిన తర్వాత వరి నాటులో అడవి పందులు వరి నాటును ధ్వంసం చేయగా వారి చేను కోసం కావాలి వెళ్లిన రైతు ఒడ్డు పై నుంచి కాలుజారి పొలంలో పడి చనిపోగా ఆ రైతుకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం కట్టించకుండా ఆ పేద రైతు కుటుంబం ఇంటి పెద్ద లేక అనాధలుగా బతుకుతున్న వైనం ఈరోజుకు ప్రభుత్వం అకాల మరణం కింద ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు దీనికి ప్రభుత్వం చిత్త శుద్ధి లేక రైతు బీమా డబ్బులు ఇంతవరకు చెల్లించకుండా రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఈ కుటుంబానికి చెల్లించాలి లేదా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని అక్కపల్లి ప్రజలు మరియు పాలకవర్గం అన్నారు.