logo

ముస్తాబవుతున్న ముజ్గి మల్లన్న ఆలయం.




(చంద్ర న్యూస్ :-నిర్మల్ జిల్లా బ్యూరో, 28 జనవరి 2026).

నిర్మల్ మండలం లోని ముజ్గి గ్రామంలో అంగ రంగ వైభవంగా జాతర మహోత్సవానికి ముస్తాబవుతున్న మల్లన్న ఆలయం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మాఘమాస పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు జాతర మహోత్సవ పండుగను జరుపుకుంటారు.31జనవరి దేవుని కళ్యాణ మహోత్సవం.01 ఫిబ్రవరి నాడు సల్లంబలి,02 ఫిబ్రవరి నాడు రతమహోత్సవం మరియు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం,03 ఫిబ్రవరి నాడు నాగవెల్లి, 04 ఫిబ్రవరి నాడు అగ్నిగుండం. ఈ పూజా కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ పూజారులు మరియు వీడీసీ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.ఈ ఐదు రోజుల కన్నుల విందుల పండుగను చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు మరియు దూర ప్రాంతం నుండి భక్తులు అనేక మంది తరలి వస్తారని ఆలయ పూజారులు మరియు అన్నదాన కార్యక్రమ కమిటీ సభ్యులు వీడిసి సభ్యులు తెలియజేశారు.

68
2619 views