మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
జర్నలిస్టు : మాకోటి మహేష్
ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతి వేగంగా ప్రయాణిస్తూ, మెట్రో పిల్లర్ 97ను బలంగా ఢీకొట్టిన కారు
ఈ సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తుండగా, అక్కడికక్కడే మృతిచెందిన సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు
వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా, సురక్షితంగా బయటపడ్డ సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే ముగ్గురు విద్యార్ధులు
బాధితులు వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తింపు
ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు