logo

మద్యం మత్తులో చేయి కోసుకుని సైకో వీరంగం.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తూ..తనను తాను గాయపరుచుకోవడమే కాకుండా, అడ్డువచ్చిన వారిపై దాడికి దిగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పలాస కేటీ రోడ్డులోని బిజీగా ఉండే ఇందిరా చౌక్ వద్ద తాజాగా ఒక యువకుడు మద్యం మత్తులో ప్రత్యక్షమయ్యాడు. చేతిలో ఉన్న ఒక గాజు సీసాని పగలగొట్టి, దాంతో తన చేతిని కోసుకున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా లెక్కచేయకుండా, ఆవేశంతో ఊగిపోతూ రోడ్డుపై వీరంగం సృష్టించాడు.

రక్తంతో నిండిన చేతిని చూపిస్తూ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అతడు బెదిరించాడు. ఎవరైనా ప్రశ్నిస్తే పగిలిన గాజు సీసాతో వారిపై దాడి చేయడానికి యత్నించాడు. దీంతో ప్రాణభయంతో వాహనదారులు, స్థానికులు పరుగులు తీశారు. ఈ హంగామా కారణంగా కేటీ రోడ్డులో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సదరు యువకుడి ప్రవర్తనను కొందరు మొబైల్‌లో చిత్రీకరించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అతనిపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

1
263 views