logo

దేశభాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయ స్మరణలో ఆళ్లగడ్డ

AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలో మంగళవారం రోజున శ్రీకృష్ణదేవరాయల 556 జయంతి వేడుకలను నియోజకవర్గ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని YPPM కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీగా వెళ్లి ఆళ్లగడ్డ తహసీల్దార్, మరియు MLA భూమా అఖిల ప్రియ ను కలిసి శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ఏర్పాటుకు మరియు ఆళ్లగడ్డలో కమ్యూనిటీ హాలు నిర్మించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆళ్ళగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జీవో వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రమాణ స్వీకారం ఊసే లేదని స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందించి తోటి మహిళను గౌరవించాలని బలిజ సంఘం నాయకుల అల్టిమేటం జారి చేశారు. లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిజ సంఘీయులసత్తా చూపిస్తామన్నారు.
ఆళ్లగడ్డ మార్కెట్ చైర్మన్ మైలేరు సురేఖ మాట్లాడుతూ భూమా అఖిలప్రియ గెలుపులో అన్ని వర్గాల తో పాటు బలిజలు పెద్దన్న పాత్ర వహించారని, ఆమె విజయంలో జనసేన పార్టీ తరఫున జనసైనికులు నిస్వార్థంగా పనిచేశారని, అన్ని వర్గాలతో పాటు అత్యధిక శాతం బలిజలు రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం గెలుపులో ముఖ్యపాత్ర పోషించారని, అలాంటి వారికి కూటమి ప్రభుత్వం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని ఆపడం భూమా అఖిలప్రియ ఎంతవరకు సమంజసం అని తెలియజేశారు. ఇప్పటికైనా మహిళా ఎమ్మెల్యే అయిన మీరు నేను ఒక మహిళగా అడుగుతున్నాను నా ప్రమాణ స్వీకారానికి సహకరించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాలూకా బలిజ సంఘం అధ్యక్షులు నల్లగట్ల బాలుడు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం వి ప్రసాద్, అహోబిలం కాపు, బలిజ అన్నసతం అధ్యక్షులు శెట్టి విజయకుమార్, అర్జీ గారి నరసింహుడు, గుత్తి నరసింహులు, మైలేరి మల్లయ్య, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

17
321 views