logo

విబి జి రామ్ జీ చట్టం వద్దు MGNREGA చట్టం నే అమలుపరచాలి*

*విబి జి రామ్ జీ చట్టం వద్దు MGNREGA చట్టం నే అమలుపరచాలి*

*కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి*

కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలోని నంది మండలము లో మండల పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో విబి జీ రామ్ జి చట్టం వద్దు MGNREGA చట్టం అమలు పరచాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే నిధులు ఇస్తున్నందువల్ల ఇప్పటివరకు ఇబ్బంది జరగకుండా ఉపాధి కూలీలకు పని దొరకడమే కాకుండా కూలీల సొమ్ము ఎవరి బ్యాంకు ఖాతాలో వాళ్లకు వచ్చేవి అన్నారు అది కాకుండా విబి జీ రామ్ జీ చట్టం అమలు అయితే కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాలి అందువల్ల రాష్ట్రాలు ఈ రుణాన్ని చెల్లించలేక ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారన్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో సంతకాలు సేకరించి తీర్మానించారు ఈ కార్యక్రమంలో కమలపురం నియోజకవర్గ ఇంచార్జ్ మీగడ అశోక్ కుమార్ రెడ్డి కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ జిల్లా ఉపాధ్యక్షుడు సిరాజుద్దిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హరి ప్రసాద్, జాబిర్ అలీ, శామీర్ హుస్సేన్, సిద్ధిక్ , ఫజలుల్లా, ముబారక్ బాషా ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

0
45 views