logo

బ్యాంకు ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త పిల్లలకు ఫోన్లు ఇస్తే ఖాతాలో డబ్బులు మాయం......

బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రజలకు హెచ్చరిక. సైబర్ నేరగాళ్ళు పెద్ద స్థాయిలో విజృంభిస్తున్నారు. జంతులూరులో రాము అని యువకుడి బ్యాంకు ఖాతా నుంచి మూడు దపాల్లో రూ.6 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఐదేళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అన్ని సైబర్ నేరగాళ్లు ఏపీకే యాప్ నుంచి ఆన్లైన్లో బాధితుల బ్యాంకు ఖాతా నుంచి వాళ్ళ ఖాతాలకు మళ్ళించారు. దీంతో బాధితుడి సెల్ ఫోన్లకు డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు, సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. విచారణ జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త...! సెల్ ఫోన్లు పిల్లలకు ఇచ్చిన గేమ్స్ ఆడేటప్పుడు apk యాప్లు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు గోవిందా.. గోవిందా... నిత్యం అప్రమత్తంగా ఉండండి. మీరు ఫోన్ ఉపయోగించని సమయంలో ఖచ్చితంగా నెట్టు ఆఫ్ చేయండి. తద్వారా సైబర్ నేరాలు జరగడానికి ఆస్కారం ఉండదు.

0
0 views