logo

రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన రచ్చబండను రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.


గ్రామరచ్చబండను ప్రారంభించిన... వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
👉పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ నాయుడు ఆహ్వానం మేరకు, ఆయన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ,బూర్జ మండలం, పెద్దపేట గ్రామంలో పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన రచ్చబండను రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను రాజేంద్రప్రసాద్ అభినందించారు.
గ్రామీణ ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తూ నిరంతరం సేవ చేస్తూ, గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఆనెపు రామకృష్ణ నాయుడిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
భవిష్యత్తులో ప్రజల ఆశీర్వాదంతో రామకృష్ణ నాయుడు మరింత ఉన్నత పదవులు అలంకరించి, గ్రామం, మండలం, జిల్లా అభివృద్ధికి మరింత సేవలందించాలని రాజేంద్రప్రసాద్ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి,ఉపాధ్యక్షులు వై.వినోద్ రాజు,చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్, శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు భానోజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు

0
0 views