
జిల్లా బెస్త సేవా సంఘం పిలుపు
భీష్మ ఏకాదశిని పండుగలా జరుపుకుందాం
*భీష్మ ఏకాదశిని పండుగలా జరుపుకుందాం*!
*జిల్లా బెస్త సేవా సంఘం పిలుపు*
ప్రియమైన బెస్త సోదర, సోదరీమణులారా!ఈనెల 29 గురువారం,గంగ పుత్రుడు,కురుకుల పితామహుడు,త్యాగశీలి, శత్రుభయంకరుడు, మహాభారతానికి మూల పురుషుడు అయిన భీష్మ ఏకాదశిని,జిల్లా వ్యాప్తంగా ప్రతి గంగపుత్రుడు తమ ఇంటిలో భీష్ముని చిత్రపటానికిపూజలు.నిర్వహించి,స్మరించుకోవాలని, అలాగే చరిత్రలో ఇంత ప్రాధాన్యత కలిగిన *భీష్మ ఏకాదశిని*,గంగ పుత్రులు ప్రతి నియోజకవర్గం, గ్రామం,మండల కేంద్రాలలో *భీష్మ ఏకాదశి* పండుగ వాతావరణంలో జరిగేటట్టుగా అన్ని *నియోజకవర్గ,పట్టణ, మండల బెస్త సేవా సంఘం కమిటీ* నాయకులు బాధ్యత తీసుకొని జరిగేటట్టుగా చూడాలని,జరిగిన కార్యక్రమం *మీడియా* లో వచ్చేటట్టుగా చూడాలని,తద్వారా *భీష్మ ఏకాదశిని *రాష్ట్ర పండుగ* గా ప్రకటించే విధంగా ప్రభుత్వం కన్నులు తెరిపించాలని పిలుపులుస్తున్నది. అదే రోజు *జనవరి 29 గురువారం,ఉదయం 10 గంటలకు* గంగపుత్ర కమ్యూనిటీ హాల్, అనంతపురం నగరంలో *బెస్త సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో* భీష్మ పితామహుని విగ్రహానికి
*పూలమాల అలంకరణ,పూజ* నిర్వహించబడుతుంది.కావున అనంతపురం పట్టణంలో గల ప్రతి ఒక్క గంగపుత్రుడు,గంగ పుత్రిక హాజరై భీష్ముని కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము.
కె.వి రమణ,జిల్లా అధ్యక్షులు, బెస్త సేవా సంఘం, అనంతపురం జిల్లా.