logo

"ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్- దుగ్గిరాల విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమము"

తేదీ: 27-01-2026,ఈరోజు ఉదయము ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ *తాడిబోయిన రామస్వామి యాదవ్* ఆధ్వర్యంలో దుగ్గిరాలలో గల నిమ్మగడ్డా ఫౌండేషన్ బాలుర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మార్చి నెలలో జరుగబోవు పరీక్షలలో ఉత్తమమైన ఫలితాలు సాధించేందుకై వారిలో ఉన్న భయాన్ని తొలగించి పరీక్షలకు సంసిద్ధులను చేయడానికి ప్రేరణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని *శ్రీమతి జయరత్నరాణి* అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా *డాక్టర్ ప్రత్యూష సుబ్బారావుగారు* మనస్తత్వవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు ప్రేరణాత్మక వక్త హాజరై ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *విద్యార్థులారా లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. లక్ష్యాన్ని చేరండి"* అని అన్నారు. " *మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఏకాగ్రతతో మీ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పఠనం చేసి, అధ్యయనం చేసి, ఆలోచించి రాబోవు పరీక్షలను చక్కగా వ్రాసి మీ లక్ష్యాలను చేరుకోండి. ప్రస్తుతం మీ లక్ష్యం పదవ తరగతిలో 600 మార్కులు సాధించడమే. ఇష్టపడి, కష్టపడి చదువుకున్నప్పుడే మనం లక్ష్యాలను చేరుకో గలుగుతాము. మీకు కలిగే సందేహాలను ఏరోజువి ఆ రోజే మీ మీ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలి. విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకోవాలి* " అని అన్నారు.
" *జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే జ్ఞానము, ఏకాగ్రత, నైతికతల ద్వారానే సాధ్యమవుతుంది* " అని అన్నారు. " *చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఈనాడు సమాజంలో పేదరికం నుండి వచ్చిన అనేకమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. శ్రీ సుందర్ పిచ్చయ్య, శ్రీ ముత్యాల రాజు వంటి అనేకులను ఆదర్శంగా తీసుకొని మీరు కూడ మీరు ఏర్పరచుకొన్న లక్ష్యాల సాధనకు గట్టిగా కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు"* అని విద్యార్థులలో ప్రేరణ కలిగించారు. " *జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యా బుద్ధులు నేర్పిన గురువులను గౌరవించి వారి మాటలను ఆచరించాలి. సోషల్ మీడియాకు మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. నైతికతను పాటించాలి. అప్పుడే మీరు జీవితంలో అభివృద్ధి పథంలో పయనిస్తారు* " అని విద్యార్థులలో స్ఫూర్తి, ఉత్సాహాలను నింపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు M శ్రీధర్, V బంధవి, D కృష్ణకుమారి, A రాంబాబు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొండపనేని రవి, తాడిబోయిన శ్రీధర్ బాబు, కుర్రా నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

162
5415 views