logo

గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల అవకతవకలు – గ్రామస్తుల ఆందోళన......

తాటి నగర్ గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల అవకతవకలు – గ్రామస్తుల ఆందోళన.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలం తాటి నగర్ గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు పండించేందుకు మిషన్ భగీరథ నీటిని అనధికారికంగా వినియోగిస్తున్నారని తాటి నగర్ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు .
నీటి సరఫరాపై ప్రశ్నించిన గ్రామస్తుల నల్లాలను పీకేస్తారుఅని.బెదిరింపులకుపాల్పడుతున్నారని, అధికారుల ఇష్టానుసారం నీటిని విడుస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా, ఫేక్ ఎంబీ రికార్డులు తయారు చేసి, వాస్తవంగా పనులు చేయకుండానే మిషన్ భగీరథ పేరిట లక్షల రూపాయల బిల్లులు లేపుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని తాటి నగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని, కొత్తగా రాజకీయ నాయకుల మాటలు వింటూ పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని వారు కోరుతున్నారు.

0
244 views