logo

గార్లదిన్నె ఎంఆర్ఓ వెంటనే సస్పెండ్ చేయాలి బ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎం ఆర్ ఓ

దివ్యాంగుడి భూమిపై 'కూటమి' నిర్లక్ష్యం.కోర్టు తీర్పును తుంగలో తొక్కుతారా?
జెబిపి, జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్*
రెండో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం కబ్జాదారుల పక్షాన నిలబడటం శోచనీయమని జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ మండిపడ్డారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు షేక్షావలికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా, భూమిని అప్పగించకుండా వేధిస్తున్న అధికారుల తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్ష. ఉధృతమైంది.
అధికారులకు కళ్లు కనబడటం లేదా?
ఈ సందర్భంగా రామప్ప నాయక్ మాట్లాడుతూ అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు:
ప్రభుత్వ వైఫల్యం: ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వంలో, ఒక దివ్యాంగుడు తన భూమి కోసం కలెక్టరేట్ ముంగిట దీక్ష చేస్తుంటే పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
కబ్జాదారులకు 'రెవెన్యూ' వత్తాసు:న్యాయస్థానం క్లియర్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ, గార్లదిన్నె ఎంఆర్ఓ (MRO) కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు.
కలెక్టర్ మౌనం: కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో దీక్ష జరుగుతున్నా, జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?
జైభీమ్ రావ్ భారత్ పార్టీ డిమాండ్లు:
తక్షణ సస్పెన్షన్:* కోర్టు తీర్పును అమలు చేయని గార్లదిన్నె ఎంఆర్ఓపై క్రిమినల్ కేసు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేయాలి.
లిఖితపూర్వక హామీ:*బాధితుడు షేక్షావలికి 48 గంటల్లోగా భూమిని అప్పగిస్తామని అధికారులు లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.
ప్రాణహాని బాధ్యత: దీక్షలో ఉన్న దివ్యాంగుడి ఆరోగ్యానికి లేదా ప్రాణానికి ఏదైనా ముప్పు వాటిల్లితే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, మరియు ఎంఆర్ఓలే నేరుగా బాధ్యత వహించాలి.
ఇది కేవలం ఒక వ్యక్తి భూమి సమస్య కాదు.. ఇది రాజ్యాంగం ఇచ్చిన తీర్పును అమలు చేయలేని అధికారుల అసమర్థతపై పోరాటం. 48 గంటల్లో స్పందన లేకపోతే జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేసి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తాం."
రామప్ప నాయక్ పాల్గొనరు
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా కో-కన్వీనర్ నారాయణ, మహిళా అధ్యక్షురాలు మైమన, ఉరవకొండ మండల అధ్యక్షులు అనిఫ్, ధర్మవరం మండల అధ్యక్షులు అమ్రేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బంధం రమేష్, గుంతకల్ మండల అధ్యక్షులు రోషన్ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

0
642 views