
మంత్రి ఆదేశాలతో పీఏబీఆర్ కుడికాలువ పరిశీలించిన హరీష్ బాబు..
రైతుల సాగునీటి భద్రతే లక్ష్యంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలు
పీఏబీఆర్ కుడికాలువపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ
మంత్రి ఆదేశాలతో పీఏబీఆర్ కుడికాలువ పరిశీలించిన హరీష్ బాబు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మంత్రి సత్య కుమార్ యాదవ్ పనిచేస్తున్నారు – హరీష్ బాబు
రైతు పొలానికి నీరు చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పం – హరీష్ బాబు
ధర్మవరం, జనవరి 27:– రైతుల సాగునీటి అవసరాలు ఎలాంటి అంతరాయం లేకుండా నెరవేరాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిరంతరం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న పీఏబీఆర్ కుడికాలువను హరీష్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలోని నీటి ప్రవాహ పరిస్థితి, కాలువ సామర్థ్యం, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు, నీటి వృథా, అక్రమంగా నీటి చౌర్యం జరిగే ప్రమాదాలపై స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం అనంతపురంలో హెచ్చెల్సీ నీటిపారుదల శాఖకుసంబంధించిన ఎస్ఈ హెచ్చెల్సీ సుధాకర్, ఈఈ వెంకటేశ్వర్లు తదితర నీటిపారుదల శాఖ అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే సాగు సీజన్‌కు అవసరమైన నీటి అందుబాటు, పంపిణీ విధానం, కాలువల నిర్వహణ, భద్రత, గస్తీ ఏర్పాటు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లోని చెరువులకు నీరు అందించే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని హరీష్ బాబు స్పష్టం చేశారు. రైతులకు చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ,..... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మంత్రి సత్య కుమార్ యాదవ్ పనిచేస్తున్నారు. సాగునీటి విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా రైతుకు నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కాలువల పర్యవేక్షణ నుంచి నీటి పంపిణీ వరకు ప్రతిదీ నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇది రైతుల పట్ల ఆయనకు ఉన్న నిజమైన నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు.
సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు రాధాకృష్ణ, గంగాధర్ బాబు, అరుణ శివ శంకరప్ప, ఆకులేటి వీరనారప్ప, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పోతుకుంట రాజు, వెంకటేష్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.