logo

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో చేయబోయే అభ్యర్థులకు పార్టీ అభ్యర్థిగా బి ఫామ్ వరికీ ఇస్తారు అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావాహులు పెద్ద ఎత్తున పార్టీ బీఫామ్ కొరకు ఎదురుచూస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికలు హోరా హోరీగా పకడ్బందీగా జరగనున్నాయి. ఈనెల జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

422
23908 views