logo

విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన 43 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత గారు

బీసీ అభ్యర్థులు ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అని మంత్రి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో బీసీ అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

గతేడాది కూడా బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందించామని, ఈ ఏడాది కూడా అదే విధంగా ఉచిత శిక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. మొత్తం 700 మంది అభ్యర్థులతో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించగా, 100 మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

మహిళలు, పురుష అభ్యర్థులకు ఉచిత వసతి సదుపాయాలు కల్పించామని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు

9
611 views