టి యు డబ్ల్యూ జె హెచ్ - 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘణంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల ప్రెస్ క్లబ్ టి యు డబ్ల్యూ జె హెచ్–143 ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చొక్కాల మహిపాల్ అధ్యక్షత ఘనంగా నిర్వహించారు.
జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలపై వక్తలు ప్రసంగించారు. దేశాభివృద్ధిలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్‌తో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు రమేష్, గణేష్, కృష్ణ, సూర్య, శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాం ప్రసాద్, ఎమ్మార్వో కిరణ్ కుమార్, ఎంపీఓ భగవత్, ఆర్‌ఐ కరుణాకర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్, ఏపీవో సతీష్, కిరణ్, మహేష్, లత, మల్లేశం, సురేష్ తదితర అధికారులు హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు.