logo

రిపబ్లిక్ డే వేడుకల్లో రాజాం తహశీల్దార్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు జిల్లా స్థాయి అవార్డులు

విజయనగరం జిల్లా. రాజాం.

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజాం తహశీల్దార్ రాజశేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కరణం హరిబాబులకు జిల్లా స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాంనుందర్ రెడ్డి చేతుల మీదుగా వీరు ఉత్తమ తహశీల్దార్, ఉత్తమ వైద్యాధికారి అవార్డులను స్వీకరించారు.
ప్రభుత్వ సేవల్లో సమర్థత, ప్రజలకు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో నిబద్ధత, బాధ్యతాయుతంగా పని చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అధికారులు వీరిని అవార్డులకు ఎంపిక చేసినట్లు సమాచారం. రాజాం ప్రాంతంలో ప్రజాపరమైన సేవలతో పాటు పరిపాలనా వ్యవస్థను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లడంలో తహశీల్దార్ రాజశేఖర్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కరణం హరిబాబు వైద్య సేవల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలు, రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో చూపుతున్న శ్రద్ధ, ఆసుపత్రి సేవలను మరింత బలోపేతం చేయడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఉత్తమ వైద్యాధికారి అవార్డు వరించింది.
అవార్డులు అందుకున్న అనంతరం తహశీల్దార్ రాజశేఖర్‌, డా. కరణం హరిబాబులను ఆసుపత్రి సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత సేవలు అందించాలని ఆకాంక్షించారు.

0
1182 views