logo

తిరుపాడు గ్రామంలో ఘణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

గడివేముల (AIMA MEDIA): పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఎంపీపీ స్కూల్ నందు గ్రామ సర్పంచ్ చిన్నస్వామి గారి ఆధ్వర్యంలో మువ్వన్నెల జాతీయ పతాకం ఎగరవేసి విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా బివిఎన్ రాజు మాట్లాడుతూ జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం, 1950 జనవరి 26న భారతదేశపు రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సంపూర్ణ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడం.ఈ రోజున బ్రిటీష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, దేశ పాలనకు రాజ్యాంగం ప్రధాన మార్గదర్శకంగా మారిందన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26 తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు బొమ్మన యుగంధర్ రెడ్డి, గూగుల సునీల్,పంచాయతీ సెక్రటరీ మహబూబ్ బాషా , JEA శ్రావణి గారు, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, అంగన్వాడీ టీచర్ రమణమ్మ , స్కూల్ స్టాఫ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

10
1178 views