ఐటీడిఏ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొన్న ఖానాపూర్ శాసనసభ్యులు.
ఉట్నూర్ మండలం కేంద్రంలోని ఐటీడిఏ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణం అని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ . ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్, ఐటిడిఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.