logo

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి, అలాగే దేశ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములు కావాలి.


లిటిల్ హాన్స్ స్కూల్స్ & కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ !

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అలాగే దేశ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
జన్నారం మండలంలోని లిటిల్ హాన్స్ స్కూల్ మరియు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు వేడుక మాత్రమే కాదని,
త్యాగాల స్మరణ, బాధ్యతల గుర్తు, భవిష్యత్తు పట్ల ఒక నిశ్చయమైన ప్రతిజ్ఞగా నిలుస్తుందన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో. దృఢ, అదృఢమైనదిగా విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

4
351 views