logo

ఖానాపూర్ నియోజకవర్గ ఆటో డ్రైవర్లకు భూక్యా జాన్సన్ నాయక్ భరోసా. నియోజకవర్గ ఆటో డ్రైవర్లందరికీ ప్రమాద బీమా కల్పిస్తానని ప్రకటించిన భూక్యా జాన్సన్ నాయక!


ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు తన వంతు సహాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం నేనే చెల్లిస్తానని మరోసారి జాన్సన్ నాయక్ తన మంచి మనసును చాటుకున్నారు.ఈ రోజు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశమైన జాన్సన్ నాయక్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నదని రూ.5 లక్షల బీమా రద్దు చేసి ఆటో అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని. కేసీఆర్ ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు రైతు బీమా తరహాలో రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.24,000 కాంగ్రెస్ బాకీ నెలకు రూ.1,000 చొప్పున (సంవత్సరానికి రూ.12,000) సహాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని రెండు సంవత్సరాలకు కలిపి ప్రతి ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24,000 బాకీ ఉందని ఆ బాకీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డును కూడా ఇంకా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 3000 మంది పైన ఆటో డ్రైవర్లు ఉన్నారని వారికి ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో వ్యక్తిగతంగా తానే బీమా ప్రీమియం చెల్లిస్తానని జాన్సన్ నాయక్ ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వానికి సిగ్గు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లందరికీ బీమా చెల్లించే పరిస్థితి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఆటో డ్రైవర్లు జాన్సన్ నాయక్ కి హృదయాపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ల అద్యక్షులు ఆటో డ్రైవర్లు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

0
1441 views