logo

16వ జాతీయ ఓటు హక్కు దినోత్సవం

AP చిత్తూరు జిల్లా,పలమనేరు:16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన మరియు ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగినది. SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులు,అధికారులు ర్యాలీగా వచ్చి మానవహారం ఏర్పాటు చేసి ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని RDO భవాని, తహసిల్దార్ ఇన్బునాదం, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, అడ్వకేట్ భాస్కర్, మరియు పట్టణ ప్రముఖులు, ప్రజలు పా పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలు మరియు విద్యార్థుల చేత క్రింది విధముగా :-
1. ప్రజాస్వామ్యంలో ఓటు-హక్కు ఒక బలమైన ఆయుధం.
2. ఓటు వేయుట మరచినట్లయితే-నిన్ను నీవు మరచినట్లే.
3. ఓటు అమ్ముకున్న వాడు-కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లే.
4. ఓటు హక్కే కాదు-మన బాధ్యత కూడా.
5. ఓటుకు నోటు-సమాజానికి చేటు.
6. ఓటు హక్కును వినియోగిద్దాం-మన ఉనికిని తెలియజేద్దాం.
7. 5 ఏళ్ల ఓటు-100 ఏళ్ల మన భవిష్యత్తు.
8. నోటిమాటన ఓటు వేయకు-సమాజానికి కాటయ్యకు.
9. ఓటు హక్కు-మనాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
10. నిజాయితీగా ఓటు వేయండి -ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
11. ఓటు అమ్మ రాదు. కొనరాదు. బుల్లెట్ కంటే-బ్యాలెట్ బలమైనది.
12. మార్పు కోరుకుంటే సరిపోదు-నువ్వు వెళ్లి ఓటు వేసి ఆ మార్పును చూడాలి.
13. ఓటు అనేది-ప్రతి పౌరుడి హక్కు.
14. ఓటు లేని మనిషి-రక్షణ లేని మనిషి.
15. ఓటు వేసే అవకాశాన్ని-కోల్పోవద్దు.
16.బలమైన దేశాన్ని సృష్టించేది-మీ ఓటు.
17. ఓటుకు ఉన్న శక్తి-ప్రపంచాన్ని మార్చే శక్తి.
18. ఒక్క ఓటు-పడవను కదిలించగలదు.
19. మన ఓటే నా-భవిష్యత్తు.
20. నిజాయితీగా ఓటు వేయండి- ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
21. మీ,నా, మన ఓటు - 5 ఏళ్ల భవిష్యత్తు.
22. ఓటు హక్కు ఏ కాదు-మన బాధ్యత కూడా.
23. ఓటును ఎవరు అమ్మ రాదు-అలాగే ఓటుని ఎవరూ కొనకూడదు.
24. ఓట్లకు నోట్లు కురిపిస్తే-సమాజానికి చేటు కురిపిస్తుంది.
25.18 ఏళ్లు పూర్తయిన ప్రతి భారతీయుడు-ఓటు హక్కును వినియోగించుకోవాలి.
అని తెలియజేస్తూ MBTరోడ్డు అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పడి అక్కడికి విచ్చేసిన ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

2
6 views