
పంచాయతీ కార్యదర్శులే జెండా ఎగురవేయాలి
నూతన సర్పంచ్ లు 15 ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే...
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక సర్కులర్ తో ఆదేశాలు
పంచాయతీ కార్యదర్శులే జెండా ఎగురవేయాలి
నూతన సర్పంచ్ లు 15 ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే...
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక సర్కులర్ తో ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ లు
( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ - 9948133539 )
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నిర్వహించే జెండా వందన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులే జాతీయ జెండా ఎగుర వేయాలి.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ఆగస్ట్ 15 వరకు జెండా ఎగుర వేసే అవకాశం కోసం ఎదిరి చూడాల్సిందే....
భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ప్రతి జనవరి 26 న అధికారులు, ఆగస్ట్ 15 న ప్రజా ప్రతి నిధులు జాతీయ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు జరుపు కోవాలి.
కానీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లలో కొందరు జాతీయ జెండా ఎగురవేయాలని ఎంతో ఆశపడగా వారి ఆశలు చట్టం నిరాశల పాలు చేస్తోంది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సర్కులర్ జారీ చేసింది. అదే సర్క్యులర్ ప్రకారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్ లు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పంచాయతీ కార్యదర్శి మాత్రమే జాతీయ జెండా ఆవిష్కరించాలని ఆయా జిల్లాల పంచాయతీ అధికారులకు, మండల పంచాయతీ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ లు వచ్చే ఆగస్ట్ 15 వరకు జాతీయ జెండా ఆవిష్కరణ కోసం ఎదిరి చూడాల్సిందే.......