logo

సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు. అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు.


రథసప్తమి రోజు జిల్లేడు ఆకును తలమీద పెట్టుకుని - స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి
సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,
సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు. అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని , కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు. ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య కాలంలో పయనిస్తూలోకాన్ని.సంతోషపెడతాడు.సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది..ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి.
ఇది మాఘస్నానంలో చేసి తీరవలసినటువంటి నియమము.సర్వ తీర్థేషు యత్పుణ్యం, సర్వ వేదేషు యత్ఫలం, సకృత్ మాఘస్నానా తత్ఫలం లభతే నరః"* అని వ్యాసులవారు చెప్పారు. అంటే నిత్యం తీర్థయాత్రలు అన్నీ చేయటం వల్ల వచ్చే పుణ్యం మాఘమాసంలో స్నానం చేస్తే వస్తుంది. సకల వేదములు శ్రద్ధతో వినటం వల్ల, పారాయణం చేయటం వల్ల ఇతరులకు బోధించటం వల్ల వచ్చే ఫలితం మాఘమాసం మెుత్తం స్నానం చేయటం వల్ల పొందుతారు. స్నానం చేసాక యథాశక్తి దానం చేస్తే మంచిది. ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాలనుంచి విముక్తి పొందుతారు.
శ్రీ ఆదిత్య హృదయం , శ్రీ ఆదిత్య స్తవం పారాయణం చేసుకోవాల.......

0
25 views