logo

కూటమి ప్రభుత్వ ప్రజా భద్రత వైఫల్యంతోనే సెక్యూరిటీ గార్డ్ హరి మృతి..

కూటమి ప్రభుత్వ ప్రజా భద్రత వైఫల్యంతోనే సెక్యూరిటీ గార్డ్ హరి మృతి..

హరి మృతి పై ప్రభుత్వ స్పందనేది?..

ప్రభుత్వ మౌనం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం!

- సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ.

శ్రీరాముని శోభాయాత్రలో బాణాసంచా ఘటనలో సెక్యూరిటీ గార్డ్ హరి మృతి చెందినప్పటికీ కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడం, పరిహారం ప్రకటించకపోవడం అత్యంత అమానుష వైఖరికి నిదర్శనమని సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ విమర్శించారు.

ఆదివారం మాసాపేటలో మృతుడు హరి స్వగృహం వద్ద అంత్యక్రియ ఏర్పాట్లల్లో సిపిఐ, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ కడప నగరంలో జరిగిన శ్రీరాముని శోభాయాత్రలో బాణాసంచా ఘటనలో సెక్యూరిటీ గార్డు హరి మృతి చెందడం కూటమి ప్రభుత్వ ప్రజా భద్రతా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన/విఫలమైన ఫలితమేనని, ఇది వ్యవస్థాపిత నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణనష్టమని పేర్కొన్నారు.

ప్రధాన రహదారులలో వేలాది మంది పాల్గొంటున్న శోభాయాత్ర లో అనుమతితో కూడిన తగు భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, నిర్వాహకులు పూర్తి వైఫల్యం చెందారన్నారు.

ప్రభుత్వ వ్యవస్థాపిత నిర్లక్ష్యానికి బలైన పేద కార్మికుడు హరి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే అధికారికంగా స్పందించాలని డిమాండ్ చేశారు.

3
333 views