అరసవెల్లికి విశ్వఖ్యాతి తెస్తాం....కూన రవికుమార్
శ్రీకాకుళం : భానుడి క్షేత్రమైన అరసవెల్లిని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అసెంబ్లీ పియూసి ఛైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.రథసప్తమి వేడుకల సందర్భంగా ఆయన స్వామివారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో హిందూ ఆచారాలు, సనాతన ధర్మంపై దాడులకు పాల్పడిందని విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ధర్మాన్ని రక్షిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతోందన్నారు. రథసప్తమి వేడుకలను ఈసారి ఏడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించడంపై జిల్లా ప్రజల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సూర్యభగవానుడికి నిత్య పూజలు ఒక్క శ్రీకాకుళంలోనే జరగడం మన జిల్లా ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు.