
ఆళ్లగడ్డలో పారువేట సందడి. భక్తులకు తప్పని ఇబ్బందులు
AIMA న్యూస్.నంద్యాల జిల్లా . అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పారువేట ఉత్సవాలు ఈనెల 16న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 34 గ్రామాలలో స్వామి వారు స్వయంగా ప్రజల వద్దకు రావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన స్వామి రాక కోసం ఆళ్లగడ్డ భక్తులు ఎదురుచూస్తున్నారు. 4 రోజుల పాటు పట్టణంలోనే స్వామి వారు ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. అయితే పట్టణంలోని స్వామి వారి తెలుపు పరిసర ప్రాంతాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే పాత బస్టాండులో కనీసం ఒక్క మొబైల్ వాష్ రూమ్ (తాత్కాలిక మరుగుదొడ్డి) కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణం. గంటల తరబడి వేచి ఉండే మహిళా భక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో వాష్ రూమ్స్ లేకపోవడంతో అటు భక్తులు ఇటు స్వామివారి పల్లకి మోసే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు .పారిశుధ్యం గురించి గొప్పలు చెప్పే అధికారులు, ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు కీలక ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని స్థానికులు మరియు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి, తక్షణమే మొబైల్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.