
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి....
అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లండి
– ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
– సోషల్ మీడియాను ఓ ఆయుధంగా చేసుకోండి
– సచివాలయ కమిటీల నిర్మాణ రచ్చబండ కార్యక్రమంలో అనంత సూచన
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ, అనుబంధ విభాగాల కమిటీల నియామకాల్లో భాగంగా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని వైయస్సార్ సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. అనంతపురం నగరంలోని శాంతినగర్ బోర్డ్ నందు 69, 70 సచివాలయ స్థాయి కమిటీల నిర్మాణ రచ్చబండ కార్యక్రమంకు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ కమిటీలతో పాటు అనుబంధ విభాగాలైన యువజన, విద్యార్థి, మహిళ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రేడ్ యూనియన్, సోషల్ మీడియా కమిటీలను గడువులోగా నియమించాలని తెలియజేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవాళ్లను గుర్తించి కమిటీల్లోకి తీసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తించి అందరి సమన్వయం, భాగస్వామ్యంతో ముందుకెళ్లాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందజేశామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రచార ఆర్భాటానికి మాత్రమే పరిమితం అవుతోందన్నారు. 19 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను ఓ ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీతో పాటు అనుబంధ విభాగాల కమిటీలు కీలకమని తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు.