logo

నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ అతిథి హోదాలో స్వాగతించిన మహారాష్ట్ర ప్రభుత్వం

నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ప్రభుత్వ అతిథి హోదాలో స్వాగతించిన మహారాష్ట్ర ప్రభుత్వం

శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న శ్రీ పవన్ కళ్యాణ గారు
ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వ అతిథిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలికింది. నాందేడ్ లోని శ్రీ గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు శ్రీ అశోక్ చవాన్ గారు, ఆయన కుమార్తె భోకార్ శాసన సభ్యురాలు శ్రీజయ చవాన్, శాసన మండలి సభ్యులు శ్రీ రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ ఖరడ్లే తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు శ్రీ అజిత్ గోప్ చడే, ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు శ్రీ రాజేంద్ర కోడగే తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించారు.

12
947 views