logo

శ్రీ సత్య సాయి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

శ్రీ సత్య సాయి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

సికేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ

రామగిరి సర్కిల్ పోలీస్ శాఖ మరియు కిమ్స్ సవేరా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైద్య సేవలు పొందారు.

ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఈసీజీ, కంటి మరియు పంటి వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఖర్చుతో కూడుకున్న ఈసీజీ వంటి సేవలు సైతం ఉచితంగా అందించడం ప్రజల్లో మరింత సంతృప్తిని కలిగించింది.

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు స్వయంగా వైద్య శిబిరంలో పాల్గొని ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ, మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని ప్రజలకు సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి దగ్గరే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

భారీగా తరలివచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం, తాగునీరు, నీడ వసతులు కల్పించిన పోలీస్ యంత్రాంగం మరోసారి ప్రజల మన్ననలు పొందింది. ప్రజల ఆరోగ్యం కోసం పోలీస్ శాఖ చేస్తున్న ఈ సేవలు అభినందనీయం

ప్రజల ఆరోగ్యమే మా బాధ్యత – పోలీస్ శాఖ సేవలు ప్రజల కోసం

32
1905 views