logo

ఆదిత్యని దర్శించుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

AIMA న్యూస్ శ్రీకాకుళం :
*శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూర్యనారాయణ స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు మంచి రోజులు రావాలని, మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద ఆశీర్వచనం చేశారు..*

9
687 views