logo

అరసవెల్లి ఆదిత్యని దర్శించుకున్న ఎమ్మెల్యే...కూన రవికుమార్

*రథ* *సప్తమీ పర్వదినాన అరసవెళ్లి* *ఆదిత్యనాథుడి దర్శించుకున్న* *ఎమ్మెల్యే రవికుమార్* *గారు*
*భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న* *ఎమ్మెల్యే గారు*

రథ సప్తమీ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా అరసవెళ్లిలోని ప్రముఖ సూర్యక్షేత్రం శ్రీ సూర్య నారాయణ స్వామివారిను ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పియుసి) చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, రథ సప్తమీ ఉత్సవ కార్యక్రమాలను దర్శించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

రథ సప్తమీ వంటి పవిత్ర పర్వదినం నాడు అరసవెళ్లి ఆదిత్యనాథుని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, సూర్యనారాయణ స్వామి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

5
187 views