logo

నగరిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు....

నగరి వార్త : ఏపీకి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం : నగరి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..* చిత్తూరు జిల్లాలోనే యాభై ఏళ్లు క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తునే ఉన్నానని, దావోస్ కు వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. *నిన్న విజయవాడ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ కేంద్రమైన నగరిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 18 నెల తర్వాత నగరిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కి స్థానిక శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత ప్రజా వేదికలో ముందుగా శాసనసభ్యుడు గాలి భాను ప్రకాష్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి గురించి చెప్తూ ఆ రోజుల్లో నేను అమెరికాలో విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే అక్కడ కొన్ని మ్యాగ్జైన్లలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి కొన్ని ఆర్టికల్స్ వచ్చేవని అవి చూసి నేను చాలా సంబరపడిపోయే వాడినని మనం గుర్తించకపోయినా ఇతర దేశాల్లో ఆయన మేదస్సు గురించి ఆర్టికల్స్ రావడం ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ విషయమని ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం మనం చేసుకున్న అదృష్టమని గాలి భాను ప్రకాష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కొనియాడారు తర్వాత చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ నగరి తెలుగుదేశం పార్టీకి కంచుకోటని దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు నగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి నిరంతరం కృషి చేసేవాడని అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ కూడా దానికి మించి ప్రజల కోసం శ్రమించాలని దిశా నిర్దేశం చేశారు ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులకు సన్మానం అవార్డులు ఇచ్చారు ప్రజా వేదికలో సమావేశం ముగించుకొని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో క్యాడర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటించారు నగరి నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని అందుకు మీ అందరి సహకారం అవసరమని క్యాడర్ను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు ప్రసంగం తర్వాత క్యాడర్లో ప్రతి ఒక్కరిని పిలిచి అందరితో ఫోటో దిగారు క్యాడర్లో ఉత్సాహాన్ని నిలిపారు...* గతంలో తాను టెక్నాలజీ అంటే అవహేళన చేశారని, ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపదను పెంచిందన్నారు. వచ్చే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుందన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యం కాపాడేలా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గతంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి నెలకొందని, ఇప్పుడు పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లపైనా, పొలాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

సంపద పెంపొందించేందుకు...

దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని, గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ లాంటి ఉత్పత్తి కూడా చేసే దిశగా అడుగులు వేశామని చంద్రబాబు అన్నారు. 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వినియోగించటం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్న చంద్రబాబు దీనికి శాశ్వతంగా పరిష్కరించేందుకు ఓ ప్రణాళికను తీసుకువస్తామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. 2024 వరకూ రాష్ట్రంలో భయంకరమైన సైకో, రాక్షస పాలన నడిచిందని, అక్రమ కేసుల్లో అరెస్టు చేసి కోర్టుకు కూడా వెళ్లకుండా తనను జైలుకు పంపించారని, సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి సంక్షేమాన్ని చేపడుతున్నామని, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తున్నామని, రాష్ట్రానికి ఈ పందొమ్మిది నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు చెప్పారు.

0
1608 views