logo

ఉపాధ్యాయుని బదిలీని వెంటనే రద్దు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండా
ఉపాధ్యాయుడు సురేష్ బదిలీని నిలిపివేయాలి చందుర్తి ఎంఈఓ కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి
చందుర్తి మండల పరిధిలోని దేవుని తండా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సురేష్ ని బదిలీ చేయవద్దని కోరుతూ, తండా సర్పంచ్ భూక్యా మోహన్ మరియు గ్రామ పాలకవర్గ సభ్యులు శనివారం చందుర్తి మండల విద్యాధికారి (ఎంఈఓ) ని కలిసి వినతి పత్రం సమర్పించారు
ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా మోహన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు సురేష్ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు ఆయన బోధనా పద్ధతుల వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, ఇలాంటి నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడిని మధ్యలో బదిలీ చేస్తే విద్యార్థుల చదువు కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
తమ పాఠశాలకు సురేష్ సేవలు ఇంకా అవసరమని, గ్రామస్థుల మరియు విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఆయన బదిలీని వెంటనే రద్దు చేయాలని ఎంఈఓ ని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన విద్యాధికారి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నునావత్ బిక్య, బి ఆర్ ఎస్ యూత్ అద్యక్షులు భూక్యా గబ్బర్ సింగ్,అజ్మీరా రాజు, భూక్యా లక్ష్మన్, బానోత్ తేజ,గుగులోత్ రాములు, గుగులోత్ శేఖర్ పాలకవర్గ సిబ్బంది, పాఠశాల కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

11
309 views