logo

ఘనంగా శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవం.

పాణ్యం (AIMA MEDIA): శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల, నంద్యాల (స్వయంప్రతిపత్తి) లో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం (రాష్ట్రీయ బాలిక్ దివస్) కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశువు సంక్షేమ & సాధికారీత అధికారిణి వి. లీలావతి దేవి పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, స్వావలంబనపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, బాలికల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

4
897 views