logo

స్వర్ణాంధ్ర. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA న్యూస్ శ్రీకాకుళం :
*▪️పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు...*

*▪️ప్లాస్టిక్ వద్దు పేపర్ బ్యాగులు ముద్దు..*

*▪️ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం...*

*పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలం బంధపల్లి గ్రామపంచాయతీ ఆశ్రమ పాఠశాల లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం అందరూ బాధ్యతని, అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర సచ్చాంద్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు."స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దివాస్" నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు,గ్రామ ప్రజలు, విద్యార్థినిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

19
1041 views