logo

స్వచ్చ పరిశుభ్ర అనంత సాధనే లక్ష్యం..* జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్,...



*స్వచ్ఛ, పరిశుభ్ర అనంత సాధనే లక్ష్యం..*

- *: నగరంలోని సూర్యనగర్ సర్కిల్ లో నిర్వహించిన బహిరంగ మలవిసర్జన రహిత అవగాహన కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్, తదితరులు..*

- *అనంతపురం నగరంలోని సూర్యనగర్ సర్కిల్ లో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బహిరంగ మలవిసర్జన రహిత (ODF) అవగాహన కార్యక్రమం నిర్వహించగా, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పిఎల్ఎన్.మూర్తి, రజక ఫెడరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్, కార్పొరేటర్ బాల ఆంజనేయులు, ధర్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, మెప్మా పిడి విశ్వజ్యోతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శశికళ, నగర పాలక సంస్థ, మెప్మా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.*

- *ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక గొప్ప థీమ్ తో ఒక ఏడాదిలో పలు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. మనం రెగ్యులర్ గా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించుకుంటున్నామని, కానీ ఈనెల సంక్రాంతి పండుగ వలన నాలుగవ శనివారం నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈనెల స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర థీమ్ "జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర" అని తెలుపుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. శానిటేషన్ కార్మికులు సక్రమంగా గ్లోవ్స్, బూట్లు, జాకెట్ తదితర వాటిని వినియోగించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయరాదని, పరిశుభ్ర అనంత, స్వచ్ఛ అనంత జిల్లాగా అందరూ సహకరించి కృషి చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వర్గీకరణ, డీ–స్లడ్జింగ్ (De-sludging), PPE కిట్ల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. IHHLలు, పబ్లిక్ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ మెరుగుపర్చడంతో పాటు, స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నారు. అలాగే పారిశుధ్య కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛత లక్ష్యాల సాధనకు శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు.*

- *ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం మేరకు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర దిశగా పలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. టాయిలెట్లను సక్రమంగా వినియోగించుకుని బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే కొద్దిసేపటి క్రితం నవోదయ కాలనీలో ఒక గృహిణి తన ఇంటిలో చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి వాటిని సక్రమంగా డిస్పోస్ చేస్తున్నారని, అలాగే మిద్దె పైన ఓపెన్ ఆవరణలో రూఫ్ గార్డెన్ నిర్వహిస్తూ పలు మొక్కలు, కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటున్నారని అన్నారు. ఇదే స్పూర్తిగా అందరూ కొనసాగించాలన్నారు.*

- *స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్ మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వారి సారథ్యంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో పారిశుధ్యం మెరుగు పడేలా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పలు థీమ్ లతో నిర్వహించుకుంటున్నామని అన్నారు. పొడి చెత్త తడి చెత్త విడివిడిగా ప్రతి ఒక్కరూ నిర్వహించాలని కోరారు.*

- *మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ మల మూత్ర విసర్జన ఫ్రీ నగరంగా ప్రకటించామని, Odf ప్లస్ గా మార్పు చెందడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగర ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.*
-
*సమావేశ అనంతరం ఎమ్మెల్యే, ఇంచార్జి జిల్లా కలెక్టర్, హాజరైన అధికారులు, ప్రజలచే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చేయించారు. అనంతరం అక్కడే ఉన్న మరుగుదొడ్ల కాంప్లెక్స్ నిర్వహణ ఇంచార్జి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి పారిశుధ్య నిర్వహణ పక్కాగ ఉండాలని వారు సూచించారు.

1
224 views