logo

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చుండ్రు విజయ్ రాజీనామా!? *త్వరలోనే ముఖ్యలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా,

తెలంగాణ స్టేట్ ***భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*** చండ్రుగొండ మండలం*** జనవరి 24 **(ఏఐఎంఏ మీమీడియా ప్రతినిధి ఎస్ డి రబ్బాని
9652413118)



కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చుండ్రు విజయ్ రాజీనామా!?

*త్వరలోనే ముఖ్యలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా,


చండ్రుగొండ, జనవరి 24:( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చుండ్రు విజయ్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామం మద్దుకూరు పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో దానకి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కొంతమంది ఆయనకు దగ్గరగా ఉన్న అనునీయుల సమాచారం మేరకు ఈ వార్త కథనం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా మూడు దశాబ్దాల క్రితం తాను రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఆపద ఉన్న ఇతోదికంగా సహాయ సహకారాలు అందించిన ఏకైక నాయకుడు చుండ్రు విజయ్ మాత్రమేనని మద్దుకూరు ప్రజలే కాకుండా మండల వ్యాప్తంగా సౌమ్యమైన నాయకుడిగా పేరున్న ఆయన ఇలాంటి నిర్ణయానికి రావడం పట్ల మద్దుకూరు గ్రామస్తులు, చండ్రుగొండ మండల ప్రజానీకం సైతం ఆయన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న రాజీనామా!? ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు మరోవైపున మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పంచాయితీ ఎన్నికల్లో ఓటమి పాలవటానికి సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు కారణంగానే ఓటమి పాలయ్యారని మొదటినుంచి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత పెరుగుతుందనే ఉద్దేశంతోనే క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చును అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు చుండ్రు విజయ్ రాజీనామాకు సిద్ధపడ్డట్టు వార్త గుప్పుమంటుంది!? త్వరలోనే పార్టీ ముఖ్యలతో చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఏఐఎంఎ మీడియాకు తెలిపారు. అదేవిధంగా తాను పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేసే దృక్పథం విడనని అది తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతుందని ఆవేదనతో తెలిపారు.

152
4454 views