
నారాయణా విద్యా సంస్థల యందు ఘనంగా వసంత పంచమీ పూజా కార్యక్రమాలు.
నంద్యాల (AIMA MEDIA): నంద్యాల సాయిబాబానగర్ నారాయణా విద్యా సంస్థల యందు ప్రిన్సిపల్ దివ్యతేజ ఆధ్వర్యంలో వసంత పంచమీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులతో అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యాభివృద్ధికి పునాది వేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఆనందాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధలుగా విచ్చేసిన A.G.M ప్రశాంత్, R.I చంద్ర మౌళి మాట్లాడుతూ చిన్నతనం నుంచే మన తెలుగు సాంప్రదాయాలకు సంస్కృతీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేస్తున్నందుకు మా నారాయణాం విద్యా సంస్థల నుంచి మేము చాలా సంతోషిస్తున్నా మన్నారు. అనంతరం ప్రిన్సిపల్ దివ్యతేజ మాట్లాడుతూ వసంత పంచమీ రోజు అక్షరాభ్యాసం చేసిన ప్రతి చిన్నారి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎదిగి వారి తల్లిదండ్రులక ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు మా నారాయణ విద్యాసంస్థలనుంచి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జోనల్ కో ఆర్డినేటర్లు శివ కుమార్ రెడ్డి, తస్లీమ్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.