logo

వేగవంతం చేయండి.. లక్ష్యాలను చేరండి: అధికారులపై జిల్లా కలెక్టర్ సీరియస్!


ఉపాధి హామీ పథకం కింద ప్రతి వేతనదారునికి 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులు, కుటుంబ సర్వే, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల వారీగా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ సర్వే ఫిబ్రవరి 10లోపు శతశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.

0
0 views