ఆత్మరక్షణే ఆయుధం: అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పీ దామోదర్ హెచ్చరిక!
ఆపద సమయంలో ప్రతి విద్యార్థిని ఆత్మరక్షణ మెళుకువలతోనే తమను తాము కాపాడుకోవాలని ఎస్ పి దామోదర్ తెలిపారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. గుడ్ టచ్-బ్యాడ్ టర్పై అవగాహనతో పాటు శక్తి యాప్ వినియోగించాలని సూచించారు. అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.